షాపింగ్ మాల్స్ మరియు జూలరీ షాప్స్ ఆకస్మిక తనిఖీలు
ఎటువంటి లక్షణం లేని సందర్శకులు మాత్రమే అనుమతించాలి
నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష
తిరుపతి:కోవిడ్-19 కారోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడి చేసే నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష జూలరి షాపులు మరియు షాపింగ్ మాల్ ఆకస్మిక తనిఖీ చేసి సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి అవసరమైన భౌతిక దూరం మరియు ఇతర నివారణ చర్యలు చేపట్టడం కోసం సోమవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.నగరపాలక సంస్థ కూడలి మరియు వి వి మహల్ రోడ్డు నందు జూలరీ షాపు, షాపింగ్ మాల్ పరిశీలించి షాప్ యజమానులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు.
నగరపాలక సంస్థ కూడలి నందు జూలరీ షాపులో నిర్వాహణ బాగాలేదని షాపులో మా స్కూల్ గాని, చేతులకు చేతికి గ్లౌజులు లేకుండా వ్యాపారం చేస్తున్నారని మరియు చిన్నపిల్లలు ను షాపులో అనుమతించి వ్యాపారం చేస్తున్న సిబ్బందికి హెచ్చరించి మొదటిసారి కాబట్టి హెచ్చరించి ఇంకొకసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.
వి వి మహల్ రోడ్ లో రెండు పెద్ద షాపింగ్ మాల్ పరిశీలించి ఏర్పాట్లు బాగున్నాయి, నిర్వహణకుఏర్పాట్లుఇలాగేఉండాలని ఆదేశించారు.