టిడిపి నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ మహిళా నేతల కాగడాల ప్రదర్శన
ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద కేశినేని శ్వేత ఆధ్వర్యంలో పత్రాలు దగ్ధం చేసిన మహిళలు
*కేశినేని శ్వేత*
వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
అసెంబ్లీ సమావేశాల సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనే భయంతోనే ఈ అరెస్టులు
ఏడాది పాలనలో వైసిపి నేతలు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు
సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారు
వారి తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అన్యాయంగా అచ్వెన్నాయుడిని అరెస్టు చేశారు
ఆరోపణలు వచ్చిన సమయంలోనే అచ్చం నాయుడు జరిగిన తీరుపై వివరణ కూడా ఇచ్చారు
ఆయినా రెండు వందల మంది పోలీసులతో ఆయన ఇంటి మీద పడి అరెస్టు చేశారు
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారోజంతా తిప్పుతూ హింసించారు
వైసిపి పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనకబడిపోయింది
ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు
అక్రమ అరెస్టు లు, కేసుల ద్వారా టిడిపి పోరాటాన్ని ఆపలేరు
కరోనా కష్టకాలంలో కూడా పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది
ఈ మూడు నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందించారు
దుర్మార్గమైన పాలన అందిస్తున్న వైసిపిని తరిమికొట్టే వరకు ప్రజలతో కలిసి టిడిపి ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తుంది