లక్ష్యం నెరవేరింది.. లక్షతో బాధ్యత పెరిగింది…

లక్ష్యం నెరవేరింది.. లక్షతో బాధ్యత పెరిగింది..

చరిత్రను తిరగరాశారు, పోలైన ఓట్లలో 80 శాతం రికార్డు. దీంతో మన మీద భాద్యత మరింత పెరిగింది, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, డబ్బు, మద్యం ఎలాంటి ప్రలోభాలు కాకుండా కేవలం ప్రేమతో ఓట్లు వేశారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీరదు. ప్రేమ రెట్టింపు అయ్యింది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.

సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం కార్యకర్తల కృతజ్ఞత సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాకు ఎంత శక్తి ఉంటే అంత చేస్త. అవార్డుల్లో ముందున్నం, అందులో మీ తోడ్పాటు ఉంది. దేశంలో సిద్దిపేట ఎప్పుడూ నంబర్ వన్ ఉండాలి. ప్రజలకు సేవ చేయటంలో ఫస్ట్ ఉందాం. ప్రజా సమస్యల పరిష్కారం కావాలి. లక్ష మెజార్టీ లక్ష్యం ఫలించింది. ఆ లక్షతో మరింత బాధ్యత పెరిగింది. చెప్పిన ప్రతి మాట నెరవేర్చటం ముందున్న లక్ష్యం. సిద్దిపేట మొత్తం కుటుంబంగా భావించాం. ఎవరికి సమస్య ఉన్న కుటుంబ సమస్యగానే భావిస్తున్నా.. ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. మీకు ఏ సమస్య ఉన్న ఒక్క వాట్సప్ పెట్టండి ఏ రాత్రి అయిన చూస్కుంటా… మీకు అండగా ఉంటానని హరీశ్ రావు అన్నారు.

About The Author