షేక్ పేట MRO సుజాత భర్త ఆత్మహత్య…
షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. చిక్కడపల్లిలోని తన చెల్లెలు ఇంటిపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడనే చనిపోయాడు. 2020, జూన్ 17వ తేదీ బుధవారం జరిగింది. కానీ ఆత్మహత్య ఎందుకు చేశాడో తెలియడం లేదు. భర్త చనిపోయన విషయాన్ని సుజాతకు తెలియచేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ చేసుకొనే ముందు..ఏదైనా లెటర్ రాశాడా ? అనే దానిపై గాలిస్తున్నారు. ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. బంరారాహిల్స్ భూ వివాదం..ఆదాయానికి మించిన కేసులో షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవలే… రూ. 30 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ భూ వివాదంపై ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శించారు. భూ వివాదంలో ఎమ్మార్వో పాత్ర ఉందని అధికారులు నిర్దారించారు. ఏసీబీ అధికారులు ఆమెను విచారించారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ..పట్టుబడిన రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నాగార్జున రెడ్డి, ఎస్ ఐ రవీంద్ర నాయక్ ను ఇప్పటికే రిమాండ్ కు ఏసీబీ అధికారులు తరలించారు. భూవివాదం కేసులో రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ అడ్డంగా దొరికిపోవడం, కేసు మాఫీ చేస్తానని ఎస్ఐ లంచం డిమాండ్ చేయడం సంచలనం రేపాయి. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ శాఖలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.