పడి పడి లేచే మనసు.. ఫీల్ గుడ్ సినిమా…

కొన్ని సినిమాల్లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది..
అవి మనకి ఎన్నిసార్లు చూసినా మనసుకి హత్తుకుపోతుంటాయి..
పడి పడి లేచే మనసు చూసిన తర్వాత నాకు అదే అనిపించింది..
అక్కడ నేను చూస్తున్నది కొత్త కథ కాదు అని నాకు తెలుస్తుంది..
కానీ ఎందుకో తెలియదు చాలా సన్నివేశాలు కొత్తగా అనిపించాయి..
అది దర్శకుడి టేకింగ్ కావచ్చు.. స్క్రీన్ పై శర్వానంద్, సాయి పల్లవి చేసే మాయ కావచ్చు..
కారణం ఏదైనా చాలా కొత్తగా అనిపించింది పడి పడి లేచే మనసు..
ఫస్ట్ హాఫ్ కాస్త సాగినట్లు అనిపించినా కూడా ఫీల్ ఉంది..
శర్వానంద్, సాయి పల్లవి ఉన్న సీన్స్ ఆకట్టుకున్నాయి..
ఇంటర్వెల్ సీన్ కాస్త సిల్లీగా అనిపించినా.. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి..
క్లయిమాక్స్ కి వచ్చేవరకు అసలు ట్విస్ట్ దాచేయడం.. చివర్లో రివీల్ చేయడం అన్ని సినిమాల్లో చూసేదే..
ఇందులో కూడా ఆ ట్విస్ట్ ముందు నుంచే ఊహించినా.. ఆ సీన్ లో ఎమోషన్ క్యారీ చేసాడు దర్శకుడు హను..
నెమ్మదిగా సాగింది అనే ఒక్క కంప్లైంట్ తప్పితే నిజంగానే పడి పడి లేచింది మనసు..
శర్వానంద్ అద్భుతంగా నటించాడు.. సాయి పల్లవి గురించి ఎం చెప్తాము..
స్క్రీన్ పై మాయ చేసింది.. వైశాలిగా ఒదిగిపోయింది..
ఓవరాల్ గా పడి పడి లేచే మనసు.. ఫీల్ గుడ్ సినిమా…

About The Author