చైనా దేశానికి వ్యతిరేకంగా తిరుపతి లో ఆందోళన.

చైనా దేశానికి వ్యతిరేకంగా తిరుపతి లో ఆందోళన.

భారత్ భూ‌భాగంపై మరోసారి కన్నేసిన‌ చైనా ,

భారత్… చైనా సరిహద్దులో తీవ్రమైన ఉద్రిక్తతలు.

తిరుపతి:యాంకర్… చైనాకి… మన దేశం భారత్ కి రోజు రోజుకీ వాస్తవాదీన రేఖవద్ద ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో భారత మాత ముద్దుబిడ్డలు‌ ఇరవైమంది‌ చనిపోయారు. చనిపోయారు అనడం‌కన్నా… దేశం‌కోసం ప్రాణాలర్పించారు.  వాళ్ల లందరికీ దేశం సగౌరవంగా నేటికీ వందనం చేస్తుంది. అయితే‌ చైనా.. భారత్ పై కయ్యానికి‌ కాలు దువ్వుతున్న తరుణంలో చైనా తయారీ వస్తువులను బ్యాన్ చేయాలని… తద్వారా ఆ దేశ ఆర్థిక వనరులపై దెబ్బ తీయాలని 130 కోట్ల భారతీయుల ఆలోచన. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా చైనా దేశంపై ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఆ ఉత్పత్తులు ఇప్పటికే కొన్ని స్వచ్చందంగా భారత్ ప్రజలు ఉపయోగించడం మానేశారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో రమాదేవి హాస్పిటల్స్ డాక్టర్లు… సిబ్బంది… స్థానిక ప్రజలు కలిసి‌కట్టుగా చైనాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ దేశ‌ అధ్యక్షుడి చిత్రపటంపై చెప్పులతో తొక్కి నిరసనలు వ్యక్తం చేశారు. దేశ సైన్యానికి తమ మద్దతు పలికారు.

About The Author