అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఫైనల్‌గా ఓ నిర్ణయం

అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వస్తున్నారు.. త్వరలోనే బస్సులు రోడ్డుపైకి రానున్నాయని ఎదురుచూస్తున్న సమయంలో.. ప్రయాణికులకు నిరాశకలిగించే పరిణామం చోటు చేసుకుంది.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య జరగాల్సిన సమావేశం రద్దు అయ్యింది.. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు… విజయవాడలో జరిగిన ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ అధికారుల సమావేశంలో అంతరాష్ట్ర సర్వీసులపై ముందడుగు పడింది.. అయితే.. ఇవాళ హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో పూర్తి క్లారిటీ వస్తుంది అని ఎదురుచూస్తున్న సమయంలో.. కీలక భేటీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. అన్ని సర్వీసులతో పాటు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే క్రమంగా సడలింపులు అమల్లోకి వస్తున్న సమయంలో బస్సులను నడపాలని రెండు రాష్ట్రాలు భావించాయి.. దానిలో భాగంగా చర్చలు కూడా జరిపాయి.. కానీ, ఇవాళ్టి భేటీలో ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వస్తారని భావిస్తున్న సమయంలో చివరి క్షణాల్లో సమావేశాన్ని రద్దు చేశారు.. మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది అనేదానిపై కూడా క్లారిటీ లేదు.. ఓవైపు.. రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్న తరుణంలో ఇప్పుడు సర్వీసులు నడపం ఎందుకులే అని ఆర్టీసీ అధికారులు వెనక్కి తగ్గారనే చర్చ కూడా సాగుతోంది.. మొత్తానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమని చెబుతున్నారు.

About The Author