ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాక్

అమరావతి:ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్. నూర్ మహమ్మద్

ఆర్టీసీలో మళ్లీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు,ఆదేశాలు లేకుండానే నోటి మాటతో రేపట్నుంచి రావద్దని చెప్పారు,7,500 మంది కుటుంబాలను రోడ్ల పాలు చేశారు,

మే వరకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు ఇచ్చిన లెక్కచేయని ఆర్టీసి యాజమాన్యం

ఒకవైపు ఆర్టీసీ సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇతర రాష్ట్రాల సర్వీస్ బస్సులు నడుపుతున్న ఆ సంస్థలో పని చేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం దారుణమని ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ మహమ్మద్ అన్నారు.

రాష్ట్రంలో ఏ ఇతర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో లేని విధంగా కేవలం నోటి మాటలతో రేపటి నుండి విధులకు హాజరు కావద్దని అన్ని డిపోలలో రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

బిక్కుబిక్కుమని గత నాలుగు నెలలుగా వేతనాలు లేకపోయినా పని చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద మరో పిడుగు లాంటి వార్త చెప్పారు.

ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యంతో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగుల పొట్ట కొట్టడమే తప్ప మరొకటి కాదు.

మీడియా గతంలో ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారని ప్రశ్నిస్తే స్వయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పేర్నినాని, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఆర్టీసీ తొలగించలేదు అని అన్నారు.

ఆనాటి నుండి నేటి దాకా తొలగించిన ఏ ఒక్క ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్ని తీసుకున్నారు.

వారిని కూడా నెల గడవకముందే వారిని కూడా విధుల నుండి తొలగించి ఆదేశాలిచ్చారు.ఇతరపనులు చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు

గత మూడు నెలలుగా డిపో చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు.కనీసం వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలు చెత్త బుట్టలో వేశారు తప్పా.ఏ ఒక్క డిపోలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఇవ్వలేదు అంటే ఇది ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కలిసి ఆడుతున్న నాటకంగా భావించాల్సి వస్తుంది.ఏ ఒక్క సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులను లాక్ డౌన్ సమయం లో తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీనే దిక్కరిస్తే ఇక అమలు చేసే నాథుడే ఎవరు అని ఆశ్చర్యం కలుగుతుంది.ఆర్టీసీ ఉన్నతాధికారులకు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నిధులు ఉంటాయి.

కానీ అదే సంస్థలు నెలకు 6000, 7000 రూపాయలు పనిచేసే చిరు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి మాత్రం నిధులు లేవని కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.

చిరుద్యోగులు పొట్టకొట్టకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను తొలగించి, ఆప్కాస్ సంస్థ కు అప్పజెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరినీ యధావిధిగా కొనసాగించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

About The Author