అర్హులైన వారికి వైఎస్సార్ చేయూత

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్న కమిషనర్ గిరీష

గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలలో ఒకటైన వైఎస్సార్ చేయూత పథకాన్ని తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన మహిళలందరూ వినియోగించుకోవాలని  కమిషనర్ గారు అన్నారు. లభ్దిదారులను గుర్తించడానికి సంబంధించి వార్డు వాలంటీర్లకు మరియు సెక్రటరీలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పథకం గురించి వివరించి అర్హులైన వారి వద్ద నుండి సంబంధిత పాత్రలను తీసుకొని వాలంటీర్ యాప్ నందు నమోదు చేస్తారన్నారు. కావున అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

 వైయస్సార్ చేయూత 

వయసు 45 సంవత్సరాలు పైన 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 18 వేల 750 రూపాయలను ఈ ఈ నాలుగేళ్ళలో ఆ కుటుంబాల 75000 రూపాయలు పొందనున్నారు.

వైయస్సార్ చేయూత అర్హతలు

మహిళలు వారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనార్టీ కులం గల వారు మాత్రమే అర్హులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ఉండాలి,

About The Author