వకుళమాత ఆలయ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి
తిరుపతి:,జూన్ 29 వకుళమాత ఆలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వీలైనంత తొందరలో ఆలయ కుంభాభిషేకము నిర్వహిస్తామని
రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅన్నారు. తిరుపతి సమీపంలోని పేరూరు పంచాయతీలో మంత్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పి ఎల్ ఆర్ కన్స్ట్రక్షన్స్ నేతృత్వంలో పేరూరు బండమీద ఆలయాన్ని నిర్మిస్తున్నారు సోమవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనులు నిర్వహిస్తున్న కార్మికులను ఆలస్యంపై ఆరా తీస్తూ మంత్రి వీలైనంత తొందరలో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అదేవిధంగా ఆలయానికి కావాల్సిన ఆధునిక హంగులును ఏర్పాటు చేయాల్సిన వాటిని అడిగి తెలుసుకున్నారు