SBI YONO: లోన్ కావాలా…ఈ యాప్ తో 24 గంటలు రుణం పొందే అవకాశం…

కరోనా సంక్షోభంలో, మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) వినియోగదారులకు అతి సులభంగా వ్యక్తిగత రుణాలు ఇస్తోంది. మీరు ఇంటి నుండి ఆన్‌లైన్‌లో ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇందు కోసం 4 సులభమైన స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మీ సౌలభ్యం ప్రకారం, మీరు ఈ వ్యక్తిగత రుణం 24X7 పొందవచ్చు. వినియోగదారులు 4 క్లిక్‌లలో YONO యాప్ ద్వారా లోన్ పొందవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా లోన్ పొందే అర్హతను మీరు తెలుసుకోవచ్చని ఎస్బిఐ ట్వీట్ చేసింది. దీని కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి PAPL<space><last 4 digits of Account No.>లను 567676 కు SMS చేయాలి.

ప్రస్తుతం, ఇప్పటికే నిర్ణయించిన కొన్ని పరిమితుల ఆధారంగా వినియోగదారులకు బ్యాంక్ రుణాలు అందిస్తున్నారు.

About The Author