నెల్లూరులో మహిళా ఉద్యోగిని పై అధికారి దాడి

నెల్లూరు ఏపి టూరిజం హోటల్  కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళ ఉద్యోగి ఉషారాణి పై,డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రాడ్ తో దాడి,మాస్కు పెట్టుకుని మాట్లాడాలని చెప్పినందుకే దాడి చేసారని బాధితురాలు ఆరోపణ. మరణ ఆయుధాలు తో దాడి చేసిన ఉద్యాగి పై పిర్యాదు,స్థానిక పోలీస్టేషన్ లో కేసు నమోదు.దాడి ఘటన పై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్,వెంటనే భాస్కర రావు పై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి

నెల్లూరు జిల్లా

నెల్లూరులో మహిళా ఉద్యోగిపై దాడి కేసులో నిందితుడిపై కేసు నమోదు… రిమాండ్ కి తరలింపు..నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉషారాణి అనే మహిళా ఉద్యోగిపై అడ్మిన్ మేనేజర్ భాస్కర్ దాడి చేసిన కేసులో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఫోర్త్ టౌన్ సీఐ నాగ రత్నమ్మ.

ఈనెల 27వ తేదీనే కంప్లయింట్ వచ్చిందని, అదే రోజు కేసు నమోదు చేశామని ఆమె స్పష్టం చేశారు.

సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించామని, అక్కడ ఉన్న సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని తెలిపారు.