ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి

పీలేరు:  పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణీ బిడ్డకు జన్మనిస్తూ  మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఉద్రిక్తతలకు దారితీసిన సంఘటనా వివరాలు ఇలాఉన్నాయి.వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామానికి చెందిన హుస్సేన్ బి(27) అనే మహిళ కాన్పు కోసం ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కలికిరి ఆసుపత్రిలో చేరింది. కాన్పు కష్టమని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని అక్కడి వైద్యులు ఆమెను 108 వాహనం ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ ఆమెను పరీక్షించిన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుందని, వేచి చూడమని బంధువులకు చెప్పి, ఆమెను పర్యవేక్షిస్తూ ఉండాలని నర్సులకు తెలియజేశారు.ఈ నేపథ్యంలో సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో హుస్సేన్ బి హఠాన్మరణం చెందింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా, కేవలం నర్సులు మాత్రమే ప్రసవం చేయడానికి ప్రయత్నించడంతో సరైన వైద్యం అందకనే అంటూ బంధువుల ఆరోపణ.తమ తప్పు లేదంటోన్న వైద్యులు

బాధితులకు న్యాయం చేయాలంటూ యువజన సంఘాల ఆందోళన

About The Author