ఇంట్లో బొగ్గులు కుంపటి..
ఇంట్లో బొగ్గులు కుంపటి..
చలి కాచుకునేందుకు అయితే జాగ్రత్త…
నిద్రలోనే మరణం..
ఇటీవల హైదరాబాద్ లో రెండు సంఘటన లలో ఆరుమంది చనిపోయిన విషయం సంచలనం సృష్టిస్తోంది.. చలి కాచుకునేందుకు ఇంట్లో బొగ్గులు పొయ్యి పెట్టి నిద్రపోయి వాళ్ళు చనిపోయారు.. బొగ్గుల పొయ్యి పెట్టి ఇంట్లో కిటికీలు మూసేసి పడుకున్నారు.. దీంతో బొగ్గులు పొగలో ఉండే కార్బన్ డైయాక్సయిడ్, మరియు కార్బన్ మోనక్సయిడ్ బయటకు పోయే దారి లేక మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ రెండు వాయువులు అత్యంత ప్రమాదం.. నిద్రలోనే మనిషికి ఆక్సిజన్ అందకుండా చేయడంతో స్పృహ కోల్పోతారు.. తెలియకుండానే ప్రాణాలు పోతాయి.. గది తలుపు మూసిఉండటంవల్ల గదిలో పొగ బయటకు పోయే అవకాశం లేక దానివల్ల ఆక్సిజన్ తగ్గి కార్బన్ వాయువులు ప్రాబల్యం మనిషి ప్రాణాలు తీస్తుంది.. ఇదంతా నిశ్శబ్దంగా జరిగిపోతుంది..