ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో ఇకపై15 నిమిషాల వీడియోస్
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌లో 15 సెకన్ల నిడివి ఉండే చిన్న చిన్న వీడియోస్ ద్వారానే ఎంతో మంది స్టార్స్‌లాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దేశంలో టిక్‌టాక్ నిషేధించడంతో ఇప్పుడు వీరికున్న లక్షలాది మంది ఫాలోవర్లు పోయారు. అయితే వీరందరి కోసమే ప్రముఖ సోషల్‌మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 15 నిమిషాల వీడియోలు పోస్ట్ చేసే ఆప్షన్‌ను తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ట్రైల్ రన్స్ జరుగుతున్నాయి. దీనికోసం బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలతో పాటు ఇండియాలో కూడా చాలా మంది కంటెన్ట్ రైటర్లను అడిగి ఇన్స్టాగ్రామ్ సూచనలు తీసుకుంటోంది.
భారత్‌లో దీనికి సంబంధించిన టెస్టింగ్‌లో భాగంగా ప్రముఖ టిక్‌టాక్ స్టార్లను తమ వీడియోలు పోస్ట్ చేయాలని కోరింది. (
భారత్‌లో ఈ రోజు(బుధవారం) సాయంత్రం 7:30నుంచి ఇన్స్టాగ్రామ్ వీడియో టెస్టింగ్ మొదలు కానుంది. ఇందుకోసం టిక్‌టాక్, ఫేస్బుక్లో బాగా పాపులర్ అయినవారిని వీడియోలు పోస్ట్ చేయాలని ఇన్స్టాగ్రామ్ కోరింది. రీల్లో కూడా టిక్‌టాక్‌లో వచ్చే మాదిరిగానే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్, డైలాగ్‌లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి కావలసిన ఎఫెక్ట్లు, బయట సౌండ్స్ ఉపయోగించాలంటే కూడా ఉపయోగించవచ్చు. ఇది కనుక సక్సెస్ అయితే టిక్‌టాక్ నిషేధంలో ఊపందుకున్న దేశీయ యాప్స్ చింగారీ, మిట్రాన్, రోపోసో, మోజ్ లాంటి వాటికి గట్టి పోటి ఇవ్వనుంది. ఇప్పటికే టిక్‌టాక్ స్టార్లందరూ తమని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవమని చెప్పారు