లక్షా 40వేల మంది టీచర్లు జీతాలు లాక్డౌన్ కారణంగా చెల్లించలేదు.
కర్నాటక:కర్నాటకలో లక్షా 40వేల మంది టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు.
ఐతే కరోనా లాక్డౌన్ వల్ల వారిలో చాలా మందికిగతమూడునెలలుగాయాజమాన్యాలుజీతాలుచెల్లించలేదు. ఈక్రమంలోనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలని కోరాయి.ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని చెప్పిన ప్రభుత్వం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్లుముందుకురావాలనిపిలుపునిచ్చింది.
పెద్ద మనసుతో తోటి టీచర్లను ఆదుకోవాలని సూచించింది.
ఈ క్రమంలోనే కర్నాటక స్టేట్ హైస్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది.కర్నాటకలోని ప్రభుత్వ స్కూళ్లలో 2.20 లక్షల మంది పనిచేస్తున్నారు.ప్రైమరీ, సెకండరీ స్కూల్ టీచర్లంతా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే.. దాదాపు రూ.30 కోట్లు సమకూరుతాయి.
ఆ నిధులతో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వ స్కూల్ టీచర్లు తెలిపారు. టీచర్స్ వెల్ఫేర్ ఫండ్‌ని కూడావినియోగించేఅంశాన్నిపరిశీలించాల్సిందిగావిద్యాధికారులకుసూచించారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లను గుర్తించేపనిలోవిద్యాశాఖ అధికారులు ఉన్నారు. అందరి వివరాలను సేకరించిన తర్వాత..నేరుగా వారి ఖాతాల్లోకేడబ్బులనుజమచేయనున్నారు.ప్రభుత్వ స్కూల్ టీచర్లు చేసిన ఈ మంచి పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.