ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే హతం

వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్‌కు తీసుకువస్తున్న సమయంలో కాన్పూర్ శివారులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునేందుకు యత్నించాడు.

ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే హతం– 

యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్‌కు తీసుకువస్తున్న సమయంలో కాన్పూర్ శివారులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపగా.. వికాస్ దుబే మరణించాడు. అతడి మృతదేహాన్ని కాన్పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

About The Author