తమిళ్‌, తెలుగు చిత్రాల్లో విలన్‌ కీ వైద్యానికి కమల్‌, రజని ఆర్థిక సాయం!

గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళ నటుడు పొన్నాంబళన్‌కు నటులు కమల్ హాసన్, రజనీకాంత్ లు ఆర్థిక సాయం చేశారు. తమిళ్‌, తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన పొన్నాంబళన్‌ చాలా రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రెండు నెలలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పొన్నాంబళన్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని కమల్‌ హాసన్‌ ముందుకొచ్చారు. వైద్యానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని రజిని హామీ ఇచ్చారు. ‘రజనీతో ముత్తు, అరుణాచలం, కమల్‌తో అపూర్వ సగోదర్‌గళ్‌, మైకేల్‌ మదన కామరాజన్‌ చిత్రాల్లో పొన్నాంబళన్‌ నటించారు.

About The Author