ఈ రోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు..


రెండు, మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌‌మున్న‌ట్లు హెచ్చ‌రించింది భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌. తెలంగాణలో‌ నైరుతి రుతు ప‌వ‌నాలు చురుకుగా క‌దులుతుండ‌గా, మ‌రో వైపు ఒరిస్సా నుంచి కోస్తా ఆంధ్రా మీదుగా అల్ప‌పీడ‌న‌ ద్రోణి కొన‌సాగుతుంది. దీంతో మెరుపులు, ఉరుముల‌తో పాటుగా భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ‌లో ఈ రోజు, రేపు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌నున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాలో మెరుపులు, ఉరుముల‌తో కూడిన‌ భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి.
ఇక ఏపీలోని ఉత్త‌ర కోస్తా, ద‌క్షిణ కోస్తా, రాయ‌ల సీమ ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ప‌లు చోట్ల తీవ్రమైన గాలితో పాటు భారీ వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

About The Author