‘అంతరిక్షం 9000 KMPH’.. Success Meet

https://www.youtube.com/watch?v=CrTkKtqzIng

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 KMPH’.. చిత్రం విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న‌ది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో క్రిష్ మాట్లాడుతూ.. అంత‌రిక్షం సినిమాకు మంచి స్పంద‌న ల‌భిస్తున్న‌ది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. సంక‌ల్ప్‌రెడ్డి అద్భుతంగా రూపొందించారు. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌ల‌ను ఈ సినిమా మెప్పిస్తుంది అని తెలిపారు. వ‌రుణ్‌తేజ్ మాట్లాడుతూ వినూత్న‌మైన ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రించ‌డం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని స్వీక‌రిస్తున్నాం. భ‌విష్య‌త్‌లో వాటిని పున‌రావృతం కాకుండా చూసుకుంటాం అని తెలిపారు. ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్‌రెడ్డి మట్లాడుతూ వైవిధ్య‌మైన ప్ర‌యోగాలు మ‌రిన్ని చేయ‌డానికి స్ఫూర్తినిచ్చిన విజ‌య‌మిది. మ‌న బ‌డ్జెట్‌లో కొత్త ఆలోచ‌న‌ల‌తో సినిమాలు తీయ‌వ‌చ్చ‌ని నిరూపించింది. సినిమాలో కొన్ని లాజిక్‌ల‌ను మిస్స‌య్యాయ‌ని అన్నారు. లాజిక్‌ల ప్ర‌కారం తీస్తే డాక్యుమెంట‌రీ అయ్యుండేది. ఇదే పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకుపోతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని అన్నారు. కొత్త ప్ర‌య‌త్నంలో తాను భాగ‌మ‌వ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని అదితిరావ్ హైద‌రీ చెప్పింది.

About The Author