నెల్లూరు జిల్లా కలెక్టర్ పై ఆకస్మిక బదిలీ వేటు…
SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబును బదిలీ చేసి GAD లో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం… ఆతని స్థానంలో ఏపి ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చక్రధర బాబు ను నియమించింది.
గత కొంత కాలంగా జిల్లా అధికార పక్ష నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సరిగా అమలు చేయలేకపోతున్నామని, రాజకీయ ఒత్తిడులు విపరీతమైన నేపథ్యంలో తనను బదిలీ చేయాలని శేషగిరి బాబు ప్రభుత్వ పెద్దల వద్ద మొర పెట్టుకొన్నారని సమాచారం, అయితే #కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇప్పట్లో బదిలీలు ఉండవని అంతా భావించారు…
ఇటీవల అత్యంత వివాదాస్పదం అయిన కరోనా మృతుల సామూహిక ఖననం అంశంలో జిల్లా మంత్రి తో వచ్చిన స్పర్ధలే ఈ ఆకస్మిక బదిలీ వేటుకు కారణమని అధికార పక్ష నాయకుల గుసగుసలు..