దుకాణదారులకు అధికారుల హెచ్చరిక..తిరుపతి నగరపాలక సంస్థ

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ, నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు రేపు (జూలై 19) ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి ఉంటుందని అధికారులు ప్రకటించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య కాబట్టి, ఈ సూచనలు పాటించాలని ప్రజలకు, దుకాణదారులకు హెచ్చరించారు. ఒకవేళ 10 గంటలు దాటిన తర్వాత కూడా దుకాణాలు తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అలాగే, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 10 గంటల పైన తెరిచినచో నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయాలని అధికారులు కోరారు.

About The Author