గుడ్ న్యూస్..ఆక్స్ఫర్డ్ వాక్సిన్‌తో కరోనా ఖతం..హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్
కరోనాను తరిమికొట్టే వాక్సిన్ కోసం ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. రష్యా, అమెరికా, చైనా, యూకే, భారత్ సహా పలు దేశాలు వాక్సిన్ను ఇప్పటి తయారుచేశాయి. ఐతే అవన్నీ హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అమెరికన్ కంపెనీ మోడెర్నా తయారుచేసిన వాక్సిన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వాక్సిన్ సైతం విజయవంతగా హ్యూమన్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. తమ పరిశోధనల్లో అద్భుత ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ రిజల్ట్స్‌ను ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురించారు.రెండు దశల మావన ప్రయోగాలకు సంబంధించిన పరిశోధనాల ఫలితాలను అందులో పొందుపరిచారు. తాము అభివృద్ధి చేసిన ChAdOx1 nCoV-19 వాక్సిన్‌తో రోగ నిరోధక శక్తి పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల శరీరంలో యాండీ బాడీలు, తెల్లరక్త కణాలు తయారయ్యాయని.. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదురించేలా రోగనిరోధక వ్యవస్థను సన్నద్ధం చేస్తోందని వెల్లడించారు. ఇది సురక్షితమైనదన్న శాస్త్రవేత్తలు.. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని పేర్కొన్నారు. తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే కనిపించాయి చెప్పారు. పారాసిటమాల్ టాబ్లెట్స్‌తో వీటిని మేనేజ్ చేయవచ్చని తెలిపారు. ఐతే మనిషి శరీరంలో ఎంతకాలం ఇది పనిచేస్తున్నదనేది మరిన్ని ప్రయోగాల తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు.
కరోనా వైరస్‌ను ఈ వాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని నిర్ధారించే ముందు దీనిపై మరింతగా ముందుకెళ్లాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం ఆశాజనక ఫలితాలు వస్తున్నాయి. — సారా గిల్ బర్ట్, ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో తయారైన ఈ వాక్సిన్ను మొదట ‘ChAdOxI’గా పిలిచారు. ఇప్పుడు AZD1222గా నామకరణం చేశారు. AZD1222 వాక్సిన్ను బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చెందారు. అందుకే ఈ వాక్సిన్ను ఆక్స్ఫర్డ్ వాక్సిన్‌గా పిలుస్తున్నారు.