బాలికపై 10 మందితో పలుమార్లు అత్యాచారం చేయించిన మహిళ.

రాజమండ్రి:సహాయాన్ని అడ్వాన్ టేజ్ గా మార్చుకుంది ఓ మహిళ. ఉద్యోగం ఇప్పించిన పాపానికి నరకం చూపించింది. తను కూడా ఓ మహిళను అనే విషయాన్ని మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించింది. పేదరికాన్ని ఆసరగా చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఏకంగా పది మంది యువకులతో ఆ అమ్మాయిపై అత్యాచారం చేయించింది ఆ దుర్మార్గురాలు. నమ్మకంగా నమ్మించి ఆ అమ్మాయి పసి హృదయాన్ని ముక్కలు చేసింది.ఈ దారుణం ఎక్కడో కాదు రాజమండ్రిలో జరిగింది.రాజమండ్రి బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఈ దారుణాలన్నీ బయటపడ్డాయి. పదో తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉన్న బాలికను అదే ప్రాంతానికి చెందిన అనిత అనే మహిళ ఓ బట్టల షాపులో జాయిన్ చేసింది. దీనిని అడ్వాన్ టేజ్ గా తీసుకుని ఐదుగురు యువకులతో కలిసి కుట్ర పన్నింది.గత నెల 22న అనిత బాలికను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లింది. ఆ బాలికను ఐదుగురు వ్యక్తులకు అప్పగించడంతో దుర్మార్గులు అమ్మాయితో పైశాచిక ఆనందం పొందారు.

రంపచోడవరం ఏజెన్సీలో నిర్మానుష్య ప్రాంతంలో అమ్మాయిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అదే ఆటోలో బాలికను తిప్పుతూ తనకు పరిచయం ఉన్న మరో ఐదుగురితో అత్యాచారం చేయింది ఈ పాపిస్టి మహిళ. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయిని బెదిరించింది. అత్యాచారం చేసిన విషయాన్ని ఎవరికైనా చెబితే నీ కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించింది. బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టింది.అయితే ఆ అమ్మాయి అనారోగ్యానికి గురికావడంతో కొన్ని రోజులపాటు బయటికి వెళ్లకుండా ఆ బాలిక తల్లి అడ్డుపడింది. కొంచెం ఆరోగ్యం కుదటపడ్డాక మళ్లీ శనిలాగా దాపురించింది అనిత. ఈ నెల 12 వ తేదీన బాలిక ఇంటికి వెళ్లి బయటకు వెళ్దామని చెప్పింది. అసలు విషయం తెలియని ఆ బాలిక తల్లి కూడా ఉద్యోగం ఇప్పించిందన్న అభిమానంతో అనితతో పంపించింది.దీంతో ఆ మహిళ మరోసారి రెచ్చిపోయింది. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ కు ఆ బాలికను తీసుకెళ్లి మళ్లీ ఆ యువకులకు అప్పగించింది. ఆ ఐదుగురు దుర్మార్గులు సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశారు. అనంతరం లావణ్య అనే మహిళ ఇంట్లో ఆ అమ్మాయిని బంధింంచారు.

ఇంటి దగ్గర ఆ అమ్మాయి తల్లి టెన్షన్ పడింది. మూడు రోజులైన కుమార్తె ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తన కూతురికి ఏదైనా అయ్యిందా అనే గందరగోళంలో ఆ అమ్మ ఆందోళన చెందింది. దీంతో ఈనెల 15 వ తేదీన కోరుకుంట పోలీసులకు తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.

ఈ విషయం తెలిసిన అనిత అమ్మాయిని వదలిపెట్టమని ఆ యువకులకు సమాచారం ఇవ్వడంతో ఆ వెదవలు బాలికను విడిచిపెట్టారు. బయటికి వచ్చి ఆ బాలిక ఇచ్చిన సమాచారంతో రాజమండ్రి పోలీసులు ఇద్దరు మహిళతో సహా 12 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరించారు.

About The Author