అతి త్వరలో రాష్ట్ర వ్యాప్త సైకిల్ యాత్రకి నారా లోకేష్..?


ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే కచ్చితంగా పార్టీకి సమర్ధ నాయకత్వం అవసరం. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో నాయకులు ఉన్నా సరే ప్రజల్లోకి వెళ్లి సమర్ధత ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి. ఏదో తెలియని పరిమితుల్లో పార్టీ అధిష్టానం కూడా ఉంది. క్రమ శిక్షణ అనే పేరుతో నాయకుల స్వేచ్చను కూడా దాదాపుగా కట్ చేసింది. ఇప్పుడు ఇక అధికార పార్టీ బరితెగింపుని చూసి టీడీపీ కూడా కాస్త దూకుడుగా వెళ్ళే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఒక్కొక్క అడుగు వేయటం మొదలు పెట్టింది.

ఈ నేపధ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లేందుకు గానూ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గితే డిసెంబర్ నుంచి యాత్రను మొదలు పెట్టే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2022 లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇప్పుడు పార్టీ అధిష్టానం ఈ ఆలోచన చేసింది అని రాజకీయ పరిశీలకులు, పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై లోకేష్ రూట్ మ్యాప్ ని కూడా ఒక టీంకి ఇచ్చి సిద్దం చేయిస్తున్నారని తెలుస్తుంది. లోకేష్ సైకిల్ యాత్ర మొదలు పెట్టే లోపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీలోని అన్ని అనుబంధ విభాగాల కమిటీలు నియమించడానికి కార్యాచరణ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సైకిల్ యాత్ర పై ఇప్పటికే లోకేష్ ఒక ప్రణాళికను పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఉంచారని, చంద్రబాబు కూడా దీనికి ఆమోదం తెలిపారని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత… డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చ్ నుంచి గాని మొదలుపెట్టే యోచనలో ఉన్నారట. రాబోయే మూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు ఉంటాయని కొంతమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అవసరం అయితే జనవరిలో ఒక మంచి రోజు చూసుకుని సంక్రాంతి తర్వాత మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. నేతలు కూడా ఇప్పుడు లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి లోకేష్ సైకిల్ యాత్ర పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపి పార్టీ పూర్వ వైభవం దిశగా నడిపించ గలరు నారా లోకేష్ బాబు గారు…

జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు…

తిరువీధుల బాపనయ్య మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ.

About The Author