ఆరోగ్యమంత్రిత్వశాఖ పొగాకు కొత్త చిత్రాలతో ఉత్పత్తులపై నిబంధులు

న్యూఢిల్లీ: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కొత్త చిత్రాలతో ఆరోగ్య హెచ్చరికలు ముద్రించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయించింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబులింగ్ మూడవ సవరణ నియమాలు 2020 ప్రకారం ఈ ఏడాది డిసెంబరు 1వతేదీ నుంచి కొత్తగా మెరుగైన హెచ్చరిక చిత్రాలు ముద్రించేందుకు ఆరోగ్యమంత్రిత్వశాఖ నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1వతేదీ నుంచి 12 నెలల పాటు ఓ హెచ్చరిక చిత్రాన్ని సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు రెండు వైపులా ముద్రించాలని నిర్ణయించారు. 2021 డిసెంబరు 1వతేదీ నుంచి రెండో చిత్ర హెచ్చరికను ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల తయారీ , సరఫరా, దిగుమతిలో కేంద్రం నిర్దేశించిన ఆరోగ్య హెచ్చరికలు ఖచ్చితంగా ముద్రించాలని కేంద్రం ఆదేశించింది,ఆరోగ్య హెచ్చరికలు ముద్రించకుంటే 2003 సెక్షన్ 20 ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది.

About The Author