వల్లభభాయి పటేల్ విషయమేమిటి…
మృత్యు దండన విధించబోతున్న 46 మంది నేరగాళ్ల తరఫున వాదిస్తున్న ఒక న్యాయవాదికి ఆయన అనుచరుడు వచ్చి ఒక చిన్న కాగితాన్ని ఇచ్చాడు.ఆయన దానిని చదివి జేబులో పెట్టుకుని తన వాదన కొనసాగించారు.భోజన విరామ సమయములో జడ్జి గారు “విషయమేమిటి? ” అని అడిగారు.”నా భార్య చనిపోయింది” అని ఆ న్యాయవాది జవాబు ఇచ్చారు.జడ్జిగారు నివ్వెరపోయి “అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళండి” అన్నారు.ఆ న్యాయవాది *”పోయిన నా భార్య ను తిరిగి తేలేను. కనీసం ఈ 46 మందికీ జీవించే అవకాశం ఇప్పించే ప్రయత్నం చేయగలను.”* అన్నారు.ఆంగ్లేయుడైన ఆ న్యాయాధికారి 46 మందినీ నిరపరాధులుగా నిర్ణయించి విడుదలచేశారు.ఆ న్యాయవాది మరెవరో కాదు, వల్లభభాయి పటేల్.3000 కోట్ల రూపాయలేమిటి, 30,000 కోట్ల విలువైన విగ్రహమైనా ఆయన కు చిన్నదే…