మమ్మల్ని కాపాడండి.. అనే పరిస్థితులు తిరుపతిలో త లెత్తకూడదు

కరోనా పాజిటివ్ వస్తే సొంత మనుషులు దగ్గరకు రాని పరిస్థితి:

ఈ క్రమంలో వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది:

కరోనా బాధితులకు, వైద్యులకు సమన్వయ కమిటీ సహకారం:

స్విమ్స్ వైద్యులతో కమిటీ  చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి:

తిరుపతి, 2020 జులై 26:తిరుపతిలోని ప్రజలు మమ్మల్ని కాపాడండి అనే పరిస్థితులు తలెత్తకూడదు.. కరోనా పాజిటివ్ వస్తే సొంత మనుషులు కూడా దగ్గరకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిస్థితుల్లో డాక్టర్ల పై ఒత్తిడి కూడా పెరుగుతోందని కోవిడ్-19 సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. చాలామంది పాజిటివ్ నిర్దారణ అయినప్పటికీ బయపడి తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. మీతో కలిసి కరోనా బాధితులకు సేవ చేసేందుకు బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ముందుకొచ్చానని వైద్యులకు భరోసా కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు శిల్పారామంలో ఉండి సమన్వయ కమిటీ సభ్యుల విధులను చెవిరెడ్డి పర్యవేక్షించారు. స్విమ్స్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునని అన్నారు.

About The Author