కళావతి 101సంవత్సరాల బామ్మ కరోనా ని జయించింది..


*చిన్నపాటి జాగ్రత, ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో, కరోనాను జయంచవచ్చును*

*తిరుపతి SVIMS అసుపత్రిలో* కరోనాకు చికిత్స పొంది, సంపూర్ణ ఆరోగ్యంతో జూలై 25న డిశ్చార్జ్ అయిన తిరుపతి పట్టణం ఎర్రమిట్ట, తుమ్బువాణి గుంటకి చెందిన కళావతి ( 101 సం. లు) కు అభినందనలు. ఎంతో మందికి ఈమె స్ఫూర్తిదాయకం

ఎర్రమిట్ట, తుమ్బువాణి గుంటకి చెందిన కళావతి ( 101 సం. లు) వృద్ధురాలు.

మనలో మనోధైర్యం, ఆత్మ విశ్వాసం ఉంటే కరోనాను జయించవచ్చును అన్నదానికి గొప్ప ఉదాహరణ కళావతి గారు.

101 సం.ల వయస్సులో కూడా ఆమె ఎంతో మనో నిబ్బరంతో ఒంటరిగా కరోనాను ఎదుర్కొని, జయించారన్నారు.

ప్రజలెవ్వరూ కరోనా అంటే ఆందోళన చెందాల్సినఅవసరం లేదు .కానీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే చాలు.

ముందస్తు జాగ్రత్తలు పాటించడం వలన కరోనారాకుండా అడ్డుకోవచ్చు.

ముందస్తు జాగ్రత్తలు పాటించినప్పటికీ కరోనా సోకితే ఆందోళన చెందకుండా

అందుకు ఆవిరిపట్టడం, పసుపు, అల్లం, వాటితో కషాయం చేసుకొని తాగడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని, అలాగే సి విటమిన్ అధికంగాలభించే పండ్లును కూడా తీసుకోవడం ఏపాటికపుడు చేతులను సబ్బుతో కానీ సానిటిజెర్ తో కానీ సుబ్రపరుచుకోవడం, మాన్క్ తప్పనిసరిగా ధరించడం, వ్యక్తులమధ్య దూరాన్ని పాటించడం వంటివి చేయడంవలన కరోనా బారిన పడకుండా ఉండవచ్చు.

ప్రజలు ఎవరు అనవసరంగా బయటకు రాకూడదని ప్రబుత్వ నిబంధనలను అందరూ తప్పకుండ పాటించి కరోనా వైరస్ నివారణకు సహకరించాలి.
డాక్టర్ శ్రీకాంత్ అర్జ స్టేట్ నోడల్ ఆఫీసర్ Covid 19
Sharing post

About The Author