ఆ విలన్‌తో పెళ్ళిపీటలెక్కనున్న సింగర్

ఇటీవల నితిన్ తన ప్రేయసిని వివాహమాడగా, ఆగస్ట్ నెలలో రానా -మిహీకాల వివాహం జరగనుంది. సాహో డైరెక్టర్ సుజీత్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలలో విలన్‌గా నటిస్తూ అలరిస్తూ వస్తున్న కబీర్ సింగ్.. పాపులర్ పంజాబీ సింగర్ అయిన డాలీ సింధుతో ఏడడుగులు వేయనున్నట్టు తెలుస్తుంది.

ఐదేళ్ళుగా కబీర్-డాలీ ప్రేమలో ఉండగా, గతేడాది వీరి నిశ్చితార్దం జరిగింది. ఈ ఏడాది మొదట్లో పెళ్ళి చేసుకోవాలనుకోగా, కరోనా వలన వాయిదా పడింది. అయితే అన్నీ అనుకూలిస్తే డిసెంబర్‌లో వారిరివురు వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గితేనే తమ పెళ్ళి ఉంటుందని అంటున్నాడు కబీర్.

ముంబైలో పెళ్లి, ఢిల్లీలో రిసెప్షన్ ప్లాన్ చేసినట్టు పేర్కొన్నాడు. తెలుగులో గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో విలనుగా ఎంట్రీ ఇచ్చిన కబీర్.. సుప్రీమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడని టాక్ నడుస్తుంది.