అమరావతి JAC కన్వీనర్ ఏ.శివారెడ్డి కామెంట్స్..
ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏ విదంగా భంగపడిందే అదే విదంగా రాజధాని విషయంలో బంగపడుతుంది అని..
రాష్ట్రప్రభుత్వంకు సుప్రీంకోర్టులో గాని, హైకోర్టు గాని ఎదో ఒకరోజు బ్లాక్ డే వస్తుంది..
దేశంలో కూడా ఇదే విదంగా మూడురాజధానిలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తే దేశం ఎన్ని ముక్కలు అవుతుందో అనే విచక్షణజ్ఞానం లేకుండా గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నారు..
రాష్ట్రప్రజల బ్రతుకు ఈ రోజుతో సర్వనాశనం అయింది.. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి, గవర్నర్ గారికి కనువిప్పు లేకుండా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది.
అమరావతిలో జరిగే అన్యాయం భవిష్యత్ లో రాయలసీమ, ఉత్తరాంధ్రవాసులకు జరుగుతాయి తస్మాత్ జాగ్రత్తఅని హెచ్చరించారు
గవర్నర్ గారి నిర్ణయముతో ప్రభుత్వం మరోసారి అమరావతి విషయంలో బంగపడుతుంది.. ఈ నిర్ణయంతో ఇంతవరకు అమరావతిలో చనిపోయినరైతులను హత్యచేయడమే.. భవిష్యత్ లో రైతులు ప్రభుత్వాలకు ఒక సెంటు భూమి ఇస్తారా అని ప్రశ్నించారు.. రైతులు భూములు ఇచ్చినపాపానికి వారిని సర్వనాశనం చేశారు అని..
రాబోయే కాలంలో రైతులు ఉసురు అంతకంతకు అనుభవిస్తారు.. ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం న్యాయస్ధానంలో నిలబడదు..
ప్రధానమంత్రి గారు అమరావతిలో గొప్పరాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు..
విభజించుకోండి పాలించుకోండి.. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయముపై ఆలోచనచేసి ఉపసంహరణచేసుకోవాలని..
అన్ని రాజకీయపార్టీలు, రైతు, సంఘాలు, మేధావులతో ఐక్యకార్యాచరణగా ఏర్పాటు చేసి గవర్నర్ గారు తీసుకొనే నిర్ణయంపై త్వరలోనే కార్యాచరణప్రకటిస్తామని.. అమరావతి విజవంతం అయినంతవరకు మా పోరాటం కొనసాగుతుంది..
గవర్నర్ గారి నిర్ణయంపై అమరావతి కోసం ఇంత వరకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు కుల మతాలకు అతీతంగా రోడ్లుపైకి వచ్చి వారి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు..
*గద్దె తిరుపతి రావు కామెంట్స్..*
ఈ దొంగప్రభుత్వం తీసుకొచ్చే తప్పుడు బిల్లులను గవర్నర్ గారు ఆమోదించడం సిగ్గు చేటు అని..
సోము వీర్రాజు గారు అమరావతిలో రాజధాని ఉండటానికి సహకరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి రావాలని..
న్యాయస్ధానంలో పోరాటం చేస్తామని. గవర్నర్ గారు తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయం. ఈ రోజు దుర్దినం..
జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పాలనలో ప్రజలు, రాష్ట్రం అన్యాయం కాబోతోంది..
అధికారపార్టీ ఎమ్మెల్యేల భవిష్యత్ అగమ్యగోచరంగా కాబోతోంది అని.. రాజధాని రైతులు ధైర్యంగా ఉండాలని..
*ఆర్.వి స్వామి కామెంట్స్..*
ఈ రోజు బ్లాక్ డే.. సోము వీర్రాజు గారిని మేము కలిస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని హామీ ఇచ్చారు..
కోర్టులో పోరాటం చేస్తామని.. 100 శాతం అమరావతిలో రాజధాని ఉంటుంది.
*మల్లికార్జునరావు కామెంట్స్.*
వైసీపీ ప్రభుత్వం కేంద్రసహకారంతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు..రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు భూస్ధాపితం కాబోతున్నాయి..
బీజేపీ కుటిలనీతిని ప్రజలు గమనిస్తున్నారు. మీ పతనం ఆంద్రప్రదేశ్ నుండి ప్రాంభమై దేశంలో కొనసాగుతుంది..
త్వరలో అఖిలపక్షం సమావేశం పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణప్రకటిస్తామని తెలిపారు..
*అనంతరం గవర్నర్ గారి నిర్ణయంపై నల్ల కండువాలు ధరించి కొవ్వెత్తులతో నిరసన తెలిపారు..*