విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో అగ్నిప్రమాదం..!


వరుస అగ్ని ప్రమాదాలతో విశాఖ వాసులు సతమతమవుతున్నారు.. ఎల్జీ పొలిమెర్స్ తో మొదలై విశాఖ లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా సంగతి తెలిసిందే.. తాజాగా… విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో అగ్నిప్రమాదం జరిగింది.. ఒక్కసారి గా ఇంజిన్ రూమ్ లో ప్రమాదం జరిగి దట్టంగా పొగలు వచ్చాయి..
వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్ లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి.. సమాచారం అందగానే..అప్రమత్తమైన కోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.. అగ్ని ప్రమాదం ఇంజన్ రూమ్ లో కావడంతో సిబ్బంది గ్యాస్ మాస్కు ధరించి మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని పోర్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.
నిన్ననే విశాఖ హార్బర్ లో ప్రమాదం జరిగింది. శనివారం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వెంటనే మంటలను గుర్తించిన మత్స్యకారులు పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు కిందకు దూకి ఒడ్డు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ ప్రమాదం తాలూకు నష్టం యాభై లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

About The Author