రికార్డ్ క్రియేట్ చేసిన యాంకర్ ప్రదీప్ సాంగ్!

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెల్సిందే. మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత పాడారు.ఈ పాట యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ పాట యూట్యూబ్ 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. సినిమా రిలీజ్ కాకముందే ఈ పాట అన్ని వ్యూస్ సంపాదించుకోవడం గమనార్హం. దక్షిణాది సినీ పరిశ్రమలో ఇదో రికార్డు అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చిlత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఆలస్యం అవుతోంది.

About The Author