ఆగస్టు 31వ తేదీ వరకు తిరుపతి లాక్ డౌన్ పొడిగింపు

ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అన్ని దుకాణాలు అనుమతి: తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో (కోవిడ్-19) కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ గత నెల 21వ తేదీ నుంచి వున్న లాక్ డౌన్ ను ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించడం జరిగింది, నగరంలో (కోవిడ్ -19) కరోనా వైరస్ మరియు అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు రేపటి నుండి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే  అనుమతి.

తిరుపతి నగరంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే దానికి నగరపాలక సంస్థ పరిధిలోని లాక్ డౌన్ పొడిగించే ఆగస్టు 31వ తేదీ వరకు ఆంక్షలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నగరంలో లో అన్ని వ్యాపార లావాదేవీలకు అనుమతులు ఉంటాయి అన్నారు, నగరంలో ప్రతి ఒక్కరు సాయంత్రం 5:00 గంటల నుండి అత్యవసరమైతే తప్ప బయట ఎవరు తిరగకూడదని తెలియజేశారు మరియు ఈ చర్య ప్రజాఆరోగ్యమును దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు సాయంత్రం 5 గంటల పైనే తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.

ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయబడును.

వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలి.

నగరంలో తొమ్మిది ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో కోవిడ్ పరీక్షలు నిర్వహించే ప్రదేశాలు

  • అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ వద్ద.
  • అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, చాపల మార్కెట్ ఎదురుగా.
  • అర్బన్ హెల్త్ సెంటర్ సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, నెహ్రూ నగర్.
  • అర్బన్ హెల్త్ సెంటర్ పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు.
  • అర్బన్ హెల్త్ సెంటర్ ఆటోనగర్, రేణిగుంట రోడ్డు.
  • అర్బన్ హెల్త్ సెంటర్ శివ జ్యోతి నగర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవకోన.
  • హార్ట్ హెల్త్ సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్డు.
  • మున్సిపల్ హెల్త్ సెంటర్, ప్రకాశం రోడ్డు.
  • అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీలామహల్ రోడ్డు, తిరుపతి.

నగర ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే నే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని, కోవిడ్ లక్షణాలు లేకపోతే రాకూడదని తెలియజేశారు.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో సాయంత్రం 5 గంటల పైన దుకాణాలు తెరిచిన చోనగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయాలి.

About The Author