ట్రిపుల్ తలక్ బిల్లు లోకసభలో పాస్ అయింది…
? ముస్లిం మహిళల రక్షణకు కీలకమైన బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం.
?ముస్లిం వివాహిత మహిళల భద్రతకు సంబంధించిన ట్రిపుల్ తలక్ బిల్లు లోకసభలో పాస్ అయింది.
?వందల సంవత్సరాల కాలం నుండి ట్రిపుల్ తలాక్ వల్ల ఎంతో మంది మహిళలు తమ హక్కులు కోల్పోతూ వస్తున్నారు.
?ముస్లిం పురుషుడు భార్యకు మెసేజ్, ఈమెయిల్,మాట ద్వారా, లేకుంటే ఫోన్ ద్వారా మూడుసార్లు ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళలకు విడాకులు ఇచ్చి మహిళలను వేధించే వారు, దీన్ని గమనించిన కేంద్రం ముస్లిం మహిళల రక్షణకు ప్రణాళిక సిద్ధం చేసింది.
?దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ట్రిపుల్ తలక్ విషయంలో మోసం చేస్తూ వస్తున్నాయి.
?ఈ ట్రిపుల్ తలక్ వలన ఎంతో మంది మహిళలు భర్త నుంచి విడిపోయి అనాధలాగా మిగిలారు. వారి కష్టాన్ని, బాధను గమనించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఈ ట్రిపుల్ తలక్ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలకు రక్షణకు బిల్లు తయారుచేశారు.
?ఈరోజుట్రిపుల్ తలక్ బిల్లు లోకసభ ప్రవేశపెట్టిన సమయంలో విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకోసం మోకాలడ్డారు. కానీ సభలో ప్రతిపక్షాలు ఆటలు సాగలేదు బీజేపీ మద్దతుతో పూర్తి మెజారిటీతో బిల్లు పాస్ అయింది.
?ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలపడంతో ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లు పైకి వచ్చి ప్రధాని మోదీకి ,బీజేపీ కి జేజేలు పలికారు.
#TripleTalaq #MuslimWomen