తెలుగు రాష్ట్రాల లో 23న మరో అల్పపీడనం..


?అల్పపీడన ప్రభావంతో గత కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో జోరు వానతో వరదనీరు చేరింది.

?మరోవైపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మరికొద్దిరోజుల పాటు వర్షాలు కంటిన్యూగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

?ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది.

?ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

? ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

?నేటి నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇదిలాఉంటే 23న మరో అల్పపీడనం ఏర్పడుతుందనే అంశం కలవరానికి గురిచేస్తోంది.

About The Author