ఎస్పీ బాలుని ECMO పై ఎందుకు ఉంచారు..? అసలు ECMO అంటే ఏమిటి.. ?


సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం ఎక్మో పరికరం సాయంతో చికిత్స పొందుతున్నారు. అసలీ ఎక్మో పరికరం అంటే ఏమిటి.. ఏ పరిస్థితుల్లో ఈ పరికరం వాడతారో ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్.. పేషెంట్ కు వెంటిలేటర్ సాయంతో అందించే వైద్యం సరిపోకపోతే.. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనే ఈ ఎక్మో పరికరం ద్వారా బ్రతికించేందుకు వైద్యం అందిస్తారు. గుండె, మరియు ఊపిరితిత్తులు, శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు విఫలమైన సందర్భంలో ప్రత్యామ్నాయంగా దీన్ని వాడతారు. ఓపెన్ హార్ట్ సర్జరీల సమయంలో కూడా ఎక్మో ద్వారా చికిత్స అందిస్తారు. శరీరంలో గుండె, ఊపిరి తిత్తులు చేసే పనిని రక్తం శుద్ధి చేసి, ఆక్సిజన్ తో కూడిన ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు అందించే పనిని ఎక్మో చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే గుండె, ఊపిరితిత్తులు చేసే పనిని, శరీరం బయట ఉండే ఎక్మో పరికరం చేస్తూ.. గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతి కలిగిస్తుంది. చాలా వ్యయంతో కూడుకున్న ఎక్మో వైద్యాన్ని, డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరంతరం.. పేషెంట్ ను పర్యవేక్షించాల్సిందే.. దేహం బయటనుంచి ఎక్మో పరికరం ద్వారా జరిగే ఈ జీవ ప్రక్రియలో రక్తం, శరీరంలో గడ్డకట్టకుండా.. బ్లీడింగ్ కాకుండా, ఇన్ఫెక్షన్ సోకకుండా, శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన రక్తం చేర్చాల్సిన అతిపెద్ద, కష్టమైన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిందే..

About The Author