గుట్టుగా వ్యభిచారం.. తల్లీకొడుకులు అరెస్ట్
లఖింపూర్ ఖేరి : ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టం లఖింపూర్ ఖేరి జిల్లాలో పోలీసులు భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్వాలి ప్రాంతంలో తల్లీకొడుకులు కొంతకాలంగా వేర్వేరు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇతర నగరాలకు చెందిన ఐదుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
ఓ లేడీ గ్యాంగ్ స్టర్, అమె ఇద్దరు కుమారులు అమ్మాయిలను ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్ మేరకు పిలిపించి వ్యభిచారం నిర్వహించే వారని పోలీసులు తెలిపారు. ఆ మహిళతో సహా ఐదుగురు యువతులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.తల్లీకొడుకులు కలిసి కొంతకాలంగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారని లఖింపూర్ సిఐ ఎస్ఎన్ తివారీ తెలిపారు.