రైతుల అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తా…మధుసూదన్ రెడ్డి గారు
రైతుల కష్టాలు తెలుసుకునేందుకే జగనన్న వ్యవసాయ కమిటీల్లో ఎమ్మెల్యేలకు అవకాశం.
* గిట్టుబాటు ధర కల్పనకు కృషి చేస్తా.
*ఎక్కువ గిడ్డంగుల నిర్మాణానికి ప్రయత్నిస్తాం ,ఎస్ ఎస్ కెనాల్ పూర్తిచేసి రైతులకు అండగా నిలుస్తాం.
*స్వర్ణముఖి నది లో చెక్ డ్యాం లు ఏర్పాటు చేసి నీటి కష్టాలు తీరుస్తాము.
*నా గురువు ను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించే అరుదైన అవకాశం నాకు రావడం గర్వంగా ఉంది.
నాకు చదువు చెప్పిన గురువుగారు నేడు “వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్” గా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది
బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు అలాగే చైర్మన్ గా వయ్యాల కృష్ణారెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ గా భక్తవత్సలం నాయుడు గారు మరియు కమిటీ సభ్యులు ఆదివారం మార్కెట్ కమిటీ ఆవరణలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్కెట్ కమిటీ లో ఎమ్మెల్యేకు భాగస్వామ్యులు చేస్తూ రైతుల కష్టసుఖాలను తెలుసుకునేందుకు మాకు గౌరవాధ్యక్షులుగా మార్కెట్ కమిటీలు అవకాశం కల్పించారు. దీని వల్ల రైతుల సాధకబాధకాలు అలాగే విత్తనాలు మరియు ధరల హెచ్చుతగ్గులు మద్దతుధరలు వంటి అంశాలు ఎమ్మెల్యే దృష్టికి రావాలని జగన్ అన్న ఆశయం. ఈ సందర్భంగా మా గురువుగారైన కృష్ణారెడ్డి గారికి చైర్మన్ గా అవకాశం కల్పించే పదవిలో నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఆయన చదువు చెప్పారు ఈరోజు నేను మా గురువు గారికి పదవి ఇచ్చే స్థాయికి ఎదిగానంటే ఆయన కూడా ఇది గర్వకారణం. కృష్ణారెడ్డి గారు ఆయనకు పని ఉంటేనే ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఆయనకు నియోజకవర్గం లోని ముఖ్యమైన బాధ్యత అయినటువంటి శ్రీ కాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది
అలాగే కమిటీ మెంబర్లుగా అన్ని ప్రాంతాల నుండి అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. మీరందరూ కూడా బాధ్యతాయుతంగా రైతుల పక్షాన నిలిచి వారి అభివృద్ధికి తోడ్పడుతూ వారికి ఎల్లవేళలా సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాన న్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు నా పైన గురుతర బాధ్యతలు పెట్టారని అత్యధిక మెజారిటీతో గెలిపించి నా బాధ్యత ఇంకా పెంచారాన్నారు. అదేవిధంగా నేను కూడా శ్రీకాళహస్తి ప్రజల బాగోగుల కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం అన్నారు శ్రీకాళహస్తి ప్రజలకు స్మశాన వాటిక కలగా ఉండేదని దానిని నిజం చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 25 కోట్ల రూపాయల అంచనాలతో భారత దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ని 100 కోట్ల రూపాయలతో చెక్ డ్యాములు నిర్మించి నీటి నిల్వ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల దాహం తీర్చడమే కాకుండా రేణిగుంట నుండి శ్రీకాళహస్తి వరకు రైతులు సాగునీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. ఎస్ ఎస్ సి కెనాల్ 90 శాతం పూర్తయిందని దాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు.నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 25 లక్షల రూపాయలతో మార్కెట్ కమిటీలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని 1.25 లక్షలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు 30 సంవత్సరాలు రాజు లాగా పాలించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. నేను గెలిచిన ఒక సంవత్సరం లోని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు రానున్నాయని, స్కిల్ డెవలప్మెంట్ కళాశాల, క్రికెట్ స్టేడియం వంటి అనేక ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నామన్నారు. తెలుగు గంగ నీటిని రైతులకు ఉపయోగపడే విధంగా సొంత నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. మరిన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. అలాగే కరోనా సమయంలో ఒక్కపూట గడిస్తే చాలు అన్నా ప్రజలకు నా వంతు ఉ డతా సహాయంగా నిత్యవసర వస్తువులు, కూరగాయలు కోడిగుడ్లు విటమిన్ టాబ్లెట్లు, శానిటైజర్ మాస్కులు బియ్యం అందజేశామన్నారు. సంవత్సరంలో రెండు పండుగలు మాత్రమే చేసుకునే ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ కరోనా కష్టకాలంలో వచ్చిందని ప్రతి ఇంట్లో ముస్లిం ఆడపడుచు నా సోదరిగా భావించి నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే కేజీ చికెన్ నిత్యవసర సరుకులు కూరగాయలు బాస్మతి రైస్ అందజేయడం జరిగిందన్నారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనయుడు హైదరాబాద్లో తన తండ్రి సంపాదించిన ఆస్తి తో కట్టిన ఇంట్లో కూర్చొని చికెన్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండండి అంటూ సందేశం పంపారు. తాను పుట్టిన ఊరు మీకు అండగా నిలిచిన ఊరందూరు గ్రామ ప్రజలకు కూడా ఒక కేజీ బియ్యం కూడా ఇవ్వని ఇతను నిత్యం ప్రజాసేవలో వున్న నన్ను విమర్శించే స్థాయి ఉందా అని ఎద్దేవా చేశారు.
రైతుల పండించిన పంట గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వ ఉంచుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి ప్రతి రెండు నెలలకు ఒకసారి రైతులతో సమావేశం నిర్వహించి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఉన్నత స్థాయి అధికారులతో ప్రతి మండలం నుండి కొంత మంది రైతులను సమావేశ పరిచి సీజన్ లో ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తదో చర్చించిన తర్వాతే రైతుల పంటలు వేసే విధంగా ప్రణాళికలు రచిస్తామన్నారు. అలాగే విత్తన అమ్మకందారులు మరియు రైస్ మిల్లర్స్, ఎరువులు పురుగుల మందులు అమ్మక దార్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి. చర్చించి రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామన్నారు
అనంతరం చైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన వయ్యాల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం గురుదక్షిణగా భావిస్తున్నానన్నారు . విద్యార్థి దశ నుండి ఎమ్మెల్యే మధు లీడర్ అని తెలిపారు.ఆయన అభివృద్ధికి కి సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు అలాగే రైతుల పక్షాన నిలిచి రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. అంతేకాకుండా ఎస్ ఎస్ సి కెనాల్ పూర్తిచేయడం,గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ప్రత్యామ్నయం పంట చెరుకు సాగుకు అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.అదేవిధంగా నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, వారి తో చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటానన్నారు. గిట్టుబాటు ధర వచ్చే పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేస్తామన్నారు.
అలాగే వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన భక్తులు నాయుడు గారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ సమయంలో కూడా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నాకు రెండు సార్లు అవకాశం వచ్చింది అన్నారు నేడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి అభిమానంతో మూడోసారి వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే నాకు నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి అలాగే చైర్మన్ గారికి రైతుల సహాయ సహకారాలు అందిస్తు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
డైరెక్ట ర్లుగా
జే మునీంద్రమ్మ,సీ మంజుల,కే కృష్ణవేణి,కే సుజాత,కె రఘు కేశవరెడ్డి,పి రేఖావతి,యం నాగమ్మ,యు మనోహర్,కవిత,ఏ గంగయ్య యాదవ్, సరస్వతి,ఎల్ శ్రీ కృష్ణా,కే మునిరాజా లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ గోవిందు, ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి , ఏడి మనోహర్ నిర్వహించారు.