రెచ్చిపోతున్న తమిళ స్మగ్లర్లు..


రెచ్చిపోతున్న తమిళ స్మగ్లర్లు
రవాణా కు సిద్దంగా ఉన్న 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒకరి అరెస్ట్

శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గత పది రోజులు గా దాదాపు ప్రతి రోజు పట్టు బడు తూనే ఉన్నారు. శనివారం అర్ధరాత్రి రవాణా కు సిద్ధం చేసి వాహనం కోసం ఎదురు చూస్తున్న స్మగ్లర్లు పై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. శ్రీనివాస మంగాపురం సమీపంలోని రైల్వే బ్రిడ్జికి దాదాపు అర కిలోమీటర్ల దూరం లో ఉన్న పొదల్లో దుంగలు పెట్టుకుని వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు కు అందిన సమాచారం మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు టీమ్ శ్రీవారి మెట్టు నుంచి కూంబింగ్ చేపట్టింది. అర్థ రాత్రి సమయంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో తారసపడగా, వారిపై దాడి చేశారు. దాదాపు 15 మంది ఉండగా, తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా జమునామత్తూరుకు చెందిన రాజు అనే యువకుడు ని పట్టుకోగలిగారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ వెంకటయ్య, ఆర్ ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ని డీఎస్పీ విచారించారు. ఆయన మాట్లాడుతూ రమేష్ అనే వ్యక్తి పోలూరు నుంచి 15 మందిని తీసుకుని వచ్చి చెట్లను నరికించినట్లు తెలిపారు. ఇతని ఆచూకీ కోసం కాల్స్ ద్వారా ట్రేస్ చేస్తున్నామని తెలిపారు. సి ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author