శునకాలూ మీ విశ్వాసానికి శతకోటి నమస్కారాలు..


కరోన కాలంలో దిక్కులేని చావులు చూస్తున్నాం… కోట్లున్నా అనాధ ప్రేతాల మాదిరి మున్సిపల్ కార్మికులు చనిపోయిన కుక్కల్ని విసిరేసినట్టు సమాధిలో తోసేస్తున్నారు. కానీ కేరళలో ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ 54 మంది కార్మికుల శవాలలో తమ యజమానుల కోసం రెండు కుక్కలు రెండు రోజులనుంచి అక్కడే ఉన్నాయి. ప్రతి శవం దగ్గరికి వెళ్లి వాసన చూసి వస్తున్నాయి. వాటి యజమానుల శవాలు ఇంకా శిథిలాల్లో ఉన్నాయి. వాటి పరిస్థితి చూసి అన్నం పెట్టినా ముట్టడం లేదు. ఇంతవరకు నిద్రపోలేదు. ప్రతి శవం బయటపడ్డ సమయంలో తమ యజమాని లేడని కన్నీరు పెడుతున్నాయి… కరోన కాలంలో మనుషులు నేర్చుకోవాలి ఈ శునకాలను చూసి….

About The Author