కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టాలని పోస్టర్ విడుదల – సాకే నరేష్


అనంతపురం నందుగల కేంద్రీయ విశ్వవిద్యాలయంనకు వాల్మీకి మహర్షి పేరు పెట్టాలని బుధవారం బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కార్యాలయంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా కలవారు వాల్మీకి మహర్షి అని భారతదేశానికి సంస్కృతి, సంప్రదాయాలను నేర్పి, కుటుంబ వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన మహనీయుని పేరు కేంద్రీయ విశ్వవిద్యాలయంనకు పెట్టడం ద్వారా మన జాతి యావత్తును గౌరవించుకున్నట్టుందని తెలిపారు. అనంతరం జాతీయ గిరిజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ జి. పోతులయ్య గారు మాట్లాడుతూ ఈ నెల 31వ తారీకున జరగబోవు వాల్మీకి జయంతిని పండగ వాతావరణంలో జరుపుకోవడం మనందరి బాధ్యతని ముఖ్యంగా ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఈ ఉత్సవంలో మమేకమై ఈ పండుగను జరుపుకోవాలని కొరడమైనది. ఎస్సి, ఎస్టీ, న్యాయవాదుల నుండి జి.రంగనాయకులు మాట్లాడుతూ మనకు జ్ఞానాన్ని అందించిన జ్ఞాన ప్రధాతకు ముఖ్యంగా చదువుకున్న మేధావులు డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు ఈ పండుగలో పాల్గొనాలని తెలిపారు. ఇందులో బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author