తిరుపతి ఎస్పీకి జాతీయ “స్కోచ్” అవార్డు…


తిరుపతి, అక్టోబర్ 29(ఆంధ్రపత్రిక):తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఆవుల రమేష్ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ “స్కోచ్” అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లా యువతను అన్నీ రంగాల్లో ప్రోత్సహించిన ఎస్పీకి అవార్డు రావడం అభినందించదగ్గ విషయం. ఈ ప్రసంశ వెనుక తిరుపతి అర్బన్ జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి సహకారంతో ఈ అవార్డు దక్కిందని జిల్లా యస్.పి తెలియజేసారు.
ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్ట కాలంలో తనదైన శైలిలో స్పందించారు. స్వతహగా దాన గుణం, దైవ గుణం కలిగిన ఈయన కరోనా సమయంలో జిల్లా అంతట కలయ తిరిగుతున్న సమయంలో అన్నం పెట్టె రైతు కూలీ నుండి యాచించే యాచకుల వరకు అందరి కడుపునిండా అన్నం దొరక్క ఇబ్బంది పడటాన్ని గమనించిన యస్.పి తానే స్వయంగా రైతు కూలీగా మారి వారిలోని నిరుత్సాహన్ని ప్రారదోలి ఉత్సాహన్ని, ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని నింపి వారితో కలసి పని చేసారు. అలాగే వారికి తన శక్తి మేర ఆదుకున్నారు. అనాదలు, వలస కూలీలు, యాచకులను గుర్తించి వారిని కూడా ఆదుకునే విషయంలో తనతో పాటు జిల్లా పోలీస్ యంత్రాగాన్ని కూడా భాగస్వాములుచేసి వారికి కూడా ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం పెట్టె కార్యక్రమాలు ఎన్నో చేసారు. ఇలా ఎన్నో విషయాలను గమనించిన పట్టణ ప్రాంతంలోని యువత, ఉద్యోగస్తులు తాము కూడా ఎందుకు రైతుగా మారకూడదు! రైతులకు సహాయపడకూడదు! అనే ఆలోచన వచ్చి వారాంతరపు సెలవు దినాల్లో వారి స్వగ్రామానికి వచ్చి రైతులుగా, రైతు కూలీలుగా మారి తనవంతు సహాయ సహకారాలను తన గ్రామానికి అందించారు. ఇది కేవలం యస్.పి తీసుకువచ్చిన మార్పువలనే. ఈ కారణంగానే ప్రతిష్టాత్మకంగా ప్రకటించే స్కోచ్ అవార్డ్ పొందినారు.
ఎస్పీకి అవార్డు పట్ల అడ్మిన్ అడిషనల్ యస్.పి సుప్రజ, తిరుమల అడిషనల్ యస్.పి మునిరామయ్యా, డి.యస్.పి లు యస్.బి గంగయ్య, ఈస్ట్ మురళీకృష్ణ, వెస్ట్ నరసప్ప, ట్రాఫిక్ మల్లికార్జున, క్రైమ్ మురళీధర్, దిశా రామరాజు, ఏ.ఆర్ డి.యస్.పి నంద కిశోర్, డి.యస్.పి లక్షణ్ కుమార్ మొదలగు వారు అభినందనలు తెలియజేసారు.

About The Author