ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తిలో
ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీ జనసందోహం మధ్య జగనన్నకు సంఘీభావం తెలుపుతూ భారీ జన సందోహంతో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి కుమార్తె బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి గారు అలాగే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా జగనన్నకు సంఘీభావం తెలుపుతూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్ నుండి పాదయాత్ర మొదలుపెట్టారు.
ముందుగా శ్రీకాళహస్తి టౌన్ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం శ్రీకాళహస్తి టౌన్ మాడవీధులు, రామసేతు వంతెన, శ్రీ రామ్ నగర్ కాలనీ మీదుగా ఏపీ సీడ్స్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి జై హో జగనన్న అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం మహిళలు తమ కోసం ప్రతి నిత్యం శ్రమిస్తున్న జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ నృత్యం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.