మీడియాలో వచ్చిన కథనాలను చూసి చలించిపోయి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ గారు


మీడియాలో వచ్చిన కథనాలను చూసి చలించిపోయి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ గారు
తన వంతు సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారికి ఫోన్ చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు
రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనారోగ్యంతో చనిపోయారు.అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కూలీ పని చేసి కుటుంబ పోషణ సాగిస్తున్నారు.అతని భార్యకు మూడు ఆపరేషన్లు చేశారు.తల్లిదండ్రులు పని చేయలేని పరిస్థితి.కొత్తగా ఇల్లు నిర్మాణం మొదలు పెట్టారు ఇంతలో తిరుపతి అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ వీధి పాలైంది.ఉండటానికి ఇల్లు లేక కులసంఘ భవనంలో నివాసం ఉంటున్నారు.
ఈ దీన స్థితి మీడియాలో రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ చూసి చలించిపోయారు. తన వంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారికి ఫోన్ చేసి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ సూచనతో ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ గారు పంపిన లక్ష రూపాయలు,తన వంతు సహాయంగా,మిగిలిన దాతలు అందించిన రెండు లక్షల రూపాయలు.
మొత్తం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించారు.అలాగే డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు.వారి పిల్లలకు చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

About The Author