“కమల హరిస్”….మన ఇంటి ఆడపడుచు…


మన ఇంటికి వంద గజాల దూరంలో పుట్టిన మాదిగ “యాదగిరి” మనవాడు కాదు….
మనతో కలిసి రోజు బడికి వచ్చి, ఒకే బెంచి మీది కలిసి కూర్చున్న “రసూల్” మనవాడు కాదు….
మనతో కలిసి గ్రౌండ్ లో ఆటలాడిన “ఎలియజర్” మనవాడు కాదు….
మనతో కలిసి ఒకే రాష్ట్రంలో కలిసి ఉన్న “సీమ, కోస్తా” జిల్లావాళ్ళు మనవాళ్ళు కాదు….
మనదేశంలోనే ఉన్న “పంజాబీ” మనవాడు కాదు….
మన మతం కానీ “కాశ్మీరీ” మనవాడు కాదు …
మన హద్దులు కలిసి ఉన్న “పాకిస్థానీ” మనవాడు కాదు….
ఎప్పుడో 70 ఏళ్లక్రితం బతువు తెరువుకోసం అమెరికాకు వలసవెళ్లిన తల్లి, ఆ పక్కనే ఉన్న జమైకా దేశం నుండి వలసవచ్చిన తండ్రి….
మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు,మన రంగు కాదు …..
అమెరికా ఉపాధ్యక్షురాలు అవగానే “కమల” మన మనిషి అయ్యింది….
మన రోగాన్ని “మందు” లేదు ……

About The Author