బుల్లితెరపై దుమ్ము దులిపిన సమంత…


ప్రముఖ నటి సమంత పెళ్లి అయిన దగ్గరనుండి సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే రంగస్థలం, U-టర్న్, సూపర్ డీలక్స్ , ఓ బేబీ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఆవిడ పోషించారు. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా చక్కటి విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే సమంత ఇటీవలే బుల్లితెరపై మెరిసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం మనాలిలో ఉండాల్సి రావడంతో ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-4కు తన బదులుగా సమంతతో హోస్టింగ్ చేయించారు. దసరా స్పెషల్ గా ఆ ఎపిసోడ్ నిలిచింది. సమంత హోస్టింగ్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సోషల్ మీడియా సంగతెలా ఉన్నా సమంత హోస్టింగ్ మాత్రం టీ.ఆర్.పీ రేటింగ్ ను దంచి కొట్టింది. ఆమె హోస్ట్ చేసిన ఎపిసోడ్ ఏకంగా 11.3 టీ.ఆర్.పీ ను సొంతం చేసుకుంది. ఈ ఎపిసోడ్ లో సమంత తో పాటు అఖిల్, పాయల్, కార్తికేయ, హైపర్ ఆది వంటి వారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మొత్తానికి సమంత తన హోస్టింగ్ తో మంచి ఇంప్రెషన్ ను క్రియేట్ చేసారు.

About The Author