చిన్నారి ధైర్యానికి హ్యాట్సాఫ్…
జమ్మూ, కాశ్మీర్ బారాముల్లాలో పాకిస్తాన్ కాల్పులలో
శుక్రవారం మరణించిన ముప్పై తొమ్మిదేళ్ల బోర్డర్
సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సబ్ ఇన్స్పెక్టర్
రాకేశ్ దోబల్ పార్దివదేహానికి సోమవారం తన
స్వగ్రామమైన రిషికేశ్ లో దహన సంస్కారాలు జరిపారు.
దోబల్ యొక్క పార్దివ దేహం ఉదయం 7 గంటలకు
రిషికేశ్‌లోని తన ఇంటికి చేరుకుంది మధ్యాహ్నం
ఆయనకు నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో
ప్రజలు హాజరయ్యారు.
ఆయనకు భార్య, ద్విత్య అనే పదేళ్ల కుమార్తె ఉన్నారు
తన తండ్రికి చివరి నివాళులు అర్పించేటప్పుడు చిన్నారి
ధైర్యాన్ని చూపించింది.
భారత్ మాతా కి జై , జై హింద్ అంటూ నినాదాలు చేస్తూ
కన్నీళ్ళు పెట్టుకోకుండా “నేను పెద్దయ్యాక సైన్యంలో
చేరి దేశానికి సేవ చేస్తాను.నా తండ్రి దేశం కోసం
తన జీవితాన్ని త్యాగం చేశాడు..నేను కూడా నాన్న అడుగుజాడలలో నడుస్తాను ఇదే నా తండ్రికి
“అంతిమ నివాళి”అంది.
దోభల్ తల్లి మరియు భార్య ఏడుస్తుంటే చిన్నారి ద్విత్య
వారిని ఓదార్చి “మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నాన్న
చేసిన త్యాగానికి గర్వపడదాం అనగానే, ”అక్కడ
గుమిగూడిన ప్రజలు ఒకసారిగా కన్నీళ్లు పెట్టారు
#జైజవాన్