ఏపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం: ఇకపై స్టేట్ రోడ్ ఫీజ్ వసూలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఏపీ స్టేట్ రోడ్ ఫీజ్ పేరిట రహదారి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రహదారులు, వంతెనలు, తాత్కాలిక బ్రిడ్జీలు వద్ద టోల్ వసూలు చేయబోతున్నారు. రాష్ట్ర రహదారులపై తేలికపాటి వాహనాలకు కిలోమీటరుకు 90 పైసలు చొప్పున, పెద్ద వాహనాలకు కిలోమీటరుకు రూ.1.80 చొప్పున, బస్ లేదా ట్రక్ లకు రూ.3.55 చొప్పున, మల్టీ యాక్సిల్ వాహనాలకు రూ.8.99 చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

About The Author