చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మెహన్ రెడ్డి కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం.


చిత్తూరు, నవంబర్ 28: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మెహన్ రెడ్డి కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల విహంగవీక్షణం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం 10.15 రాష్ట్ర హోం మంత్రి మేకపాటి సుచరిత తో పాటు రేణిగుంట విమా నాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు కె. నారా యణ స్వామి,అంజద్ బాషా, రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణా భివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖా మాత్యులు అనిల్ కుమార్ యాదవ్, చిత్తూరు ఎం పి రెడ్డప్ప, టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, తిరుపతి, నగరి, సత్యవేడు, పూతల పట్టు, తంబళ్లపల్లె, చంద్ర గిరి, కావలి ఎం ఎల్ ఏ లు భూమన కారుణాకర రెడ్డి, ఆర్ కె రోజా, ఆదిమూలం, ఎం.ఎస్ బాబు, ద్వారాక నాథ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి, డీఐజీ క్రాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, తిరుపతి, చిత్తూరు ఎస్.పి లు రమేష్ రెడ్డి, సెంథిల్ కుమార్, తిరు పతి నగర పాలక సంస్థ కమీషనర్ గిరీషా,జె సి (రెవెన్యూ) డి. మార్కండే యులు,ఆర్ డి ఓ కానక నరసా రెడ్డి, ఇతర ప్రజాప్రతి నిధులు,అధికారులు తదితరులు ముఖ్యమంత్రి కి స్వాగతం పలికారు. అనంత రం 10.25 ని.లకు రాష్ట్ర హోo శాఖ మంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖామా త్యు లతో కలసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతా ల విహంగ వీక్షణం కు బయలుదేరి వెళ్లారు.
….DD IPR CTR…

About The Author